Tuesday, April 30, 2024

ఈ వారం ఎలిమినేష‌న్ లో – ‘ఆర్జే చైతూ’

బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం కాస్త ప్రస్తుతం బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటిటి వేదికగా ప్రసారమవుతుంది. అయితే అంతకు ముందు కేవలం ఒక గంట ఎపిసోడ్ మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ఇప్పుడు ఏకంగా 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంది . ఇక బిగ్ బాస్ హౌస్ లో భాగంగా ఎంతోమంది కొత్త కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పై ఎంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అద్భుతంగా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. మరికొంతమంది మాత్రం ఈసారి బిగ్ బాస్ కార్యక్రమంలో అంత పస లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ వారం ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఒకరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేసి బయటికి పంప‌నున్నారు.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆర్జె చైతు బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వారంలో ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆర్జె చైతు హౌస్ లో మూడవ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా కూడా నిలవబోతున్నాడు. అయితేఆర్జె చైతు టాస్క్ లో పెద్దగా రాణించక పోవడం.. హౌస్ లో అతని వైఖరి.. ఇతర హౌస్మేట్స్ పట్ల అతని ప్రవర్తన సానుకూలంగా ఉండకపోవడమే ఆర్జె చైతు ఎలిమినేట్ కావడానికి కారణం అని టాక్. అయితే ఇటీవల జరిగిన టాస్క్ లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేసి చివరికి కెప్టెన్సీ సొంతం చేసుకున్నాడు. అంతలోనే ఎలిమినేట్ అవ్వడంతో ఆర్జె చైతు అభిమానులు అందరూ కూడా నిరాశ చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement