Tuesday, May 21, 2024

హార్ట్ బీట్ ని ప‌ర్య‌వేక్షించ‌నున్న ‘ష‌ర్ట్స్’ – ఇదో కొత్త ప‌రిశోధ‌న‌

టెక్నాల‌జీ ఎంత‌గానో అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో కొత్త కొత్త విష‌యాల‌ను క‌నిపెట్టేందుకు కృషి చేస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు..అదే త‌ర‌హాలో మ‌న గుండె చప్పుడును వినే సరికొత్త ష‌ర్ట్స్ ని రూపొందించారు శాస్త్రవేత్తలు. ఇది హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అమెరికాలోని ఎంఐటీ, రోడ్‌ ఐలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌కి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ వస్ర్తాన్ని అభివృద్ధి చేశారు. ఇది మైక్రోఫోన్‌ మాదిరిగా పనిచేస్తుంది. గుండెశబ్దాన్ని మెకానికల్‌ వైబ్రేషన్స్‌గా, అనంతరంగా ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌గా మారుస్తుంది. అలాగే శ్వాసప్రక్రియను కూడా పర్యవేక్షిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మ‌నే చెప్పాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement