Monday, May 6, 2024

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే.. 105 సీట్లు ఖాయం.. కేసీఆర్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ 105 సీట్లలో గెలుపొందడం ఖాయమని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరయ్యారు. అయితే కాసేపటి క్రితమే ముగిసిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏడాది కావడం వల్ల అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత పదేళ్లలో ప్రజలకు ఏం చేశామో ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరిస్తే చాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఆయా జిల్లాల్లో మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యే ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఈ పదేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని.. చేసింది చెప్పుకుంటే చాలని కేసీఆర్ సూచించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే మరో 5 నెలల్లో మాత్రమే ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతలంతా పూర్తిస్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని సూచించారు. అయితే తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితుల గురించి కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement