Monday, April 29, 2024

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుకోసం.. శివ‌రాజ్ కుమార్ వాయిస్

క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న టైగర్‌ నాగేశ్వర రావు కోసం వాయిస్ ఓవ‌ర్ ని అందించారు. టైగర్‌ నాగేశ్వర రావు చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నుపుర్‌ సనన్‌ ఈ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ సెకండ్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు వంశీ దర్శకుడు. 1970వ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. పాన్ ఇండియా నేపథ్యం కావడంతో డైరెక్టర్ వంశీ టీం పక్కా ప్రమోషన్స్ ప్లాన్‌తో ముందుకెళ్తుంది. టైగర్‌ నాగేశ్వర్‌ రావు కన్నడ వెర్షన్‌ను శివరాజ్‌కుమార్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రమోట్‌ చేయబోతున్నట్టు వీడియో ద్వారా తెలియజేశాడు వంశీ. కన్నడ టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు నిమ్మశివన్నకు ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేశాడు వంశీ. ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement