Monday, May 23, 2022

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ

ఏపీ ప్ర‌భుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది. అనంత‌పురం జాయింట్ క‌లెక్ట‌ర్ గా కేత‌న్ గార్గ్ ను బ‌దిలీ చేసింది. కాగా ఈయ‌న ప్ర‌స్తుతం రాజంపేట స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా నిశాంత్ కుమార్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ప్రస్తుతం ఈయన అనంతపురం జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. ఇక ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ గా హిమాన్షు కౌశిక్ ను నియమించింది. హిమాన్షు కౌశిక్ ప్రస్తుతం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement