Tuesday, April 30, 2024

య‌శ్ లా యాక్ట్ చేసి – న‌వ్వుల‌పాలైన సెల‌బ్రిటీ

కేజీఎఫ్ కి సీక్వెల్ గా తెర‌కెక్కింది కేజీఎఫ్2. ఈ చిత్రం విడుద‌లై ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రంలోని హీరో య‌శ్ ని ఇమిటేట్ చేయ‌బోయి న‌వ్వుల పాల‌యింది ఓ సెల‌బ్రిటీ.. కేజీఎఫ్2 విడుద‌లై హిట్ టాక్ తో దూసుకుపోతోంది..దాంతో దేశ వ్యాప్తంగా రాకీ భాయ్ ప్రభంజనం కనిపిస్తోంది. కాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. కాగా నిహారిక అనే సోషల్ మీడియా సెలెబ్రిటీతో యష్ ముచ్చట్లు పెట్టేశాడు. చాప్టర్ 2 చిత్రంలో ఓ డైలాగ్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. వయలెన్స్ వయలెన్స్ వయలెన్స్.. ఐ డోంట్ లైక్ వయలెన్స్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్ వయలెన్స్ అని యష్ ఎంతో స్టైలీష్‌గా చెబుతాడు. నిహారిక కూడా ఈ డైలాగ్‌ను స్లైలీష్‌గా చెప్పేందుకు ట్రై చేస్తుంది. ఈ క్రమంలో మందు సీసాను ప‌ట్టుకని.. దాని మూతను తీసేందుకు కిందా మీదా పడుతుంది. కానీ ఆ మూత రాదు. ఇంకో బాటిల్ ఇవ్వండి అని అడుగుతుంది. అయినా కూడా ఆ మూతని తీయలేకపోతుంది. ఇంతలో యష్ వస్తాడు. అలా సింపుల్‌గా మూత తీసి అవతల పారేస్తాడు. వయలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్ వయలెన్స్.. అని యష్ తన స్టైల్లో చెప్పేస్తాడు. ఇక ఈ వీడియోను చూసి జనాలు నవ్వేసుకుంటున్నారు. హీరోయిన్ ఇలియానా అయితే పగలబడి నవ్వేసినట్టుగా ఎమోజీలను పెట్టేసింది. ఇక కేజీఎఫ్ కి కొన‌సాగింపుగా కేజీఎఫ్3 కూడా ఉండ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. చూడాలి మ‌రి ఏమ‌వుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement