Thursday, May 2, 2024

హైదరాబాద్​పై సర్జికల్​ స్ట్రైక్ చేయాలని బీజేపీ ప్లాన్​​.. రాజాసింగ్​ అరెస్టుతో ఫెయిలయ్యింది: అసదుద్దీన్​ ఒవైసీ

హైదరాబాద్​లో బీజేపీ చేయాలనుకున్న సర్జికల్​ స్ట్రైక్​ విఫలమైందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు. అరెస్ట్​ అయిన బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్​ ఈ మధ్య చేసిన విద్వేషపూరిత ప్రసంగాల వివాదంపై ఆయన మాట్లాడారు. ‘‘హింస గురించి మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బహిష్కరించినట్టు ప్రకటించినా.. బీజేపీ సహాయం చేస్తుందనేది బహిరంగ రహస్యం.

ద్వేషపూరిత ప్రసంగాల తర్వాత అల్లర్లు చెలరేగితే ఆ తర్వాత రెచ్చిపోయి దాడులకు తెగబడాలని ప్లాన్​చేశారు. ఇది హైదరాబాద్‌లో బీజేపీ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్లాన్​. శాంతియుతంగా ఉన్నందుకు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. హైదరాబాద్‌లో బీజేపీ చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ను విఫలం చేశారు”అని ఒవైసీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement