Tuesday, May 7, 2024

Minister KTR : రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ఎదిగిన హైదరాబాద్‌

హైదరాబాద్‌ రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ఎదిగిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ను, రైట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్‌ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు. ఆటోమొబైల్‌ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్‌ ఓరియెంటెడ్‌ డిజైన్స్‌ ద్వారా ముందుకు వెళ్తున్నదని చెప్పారు.

ప్రభుత్వం మొబిలిటి వ్యాలి ప్రారంభించిందన్నారు. కంపెనీకి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా హైదరాబాద్‌ ఐటీలో 3 లక్షల మంది పనిచేసే వాళ్లు, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా పెరిగిందన్నారు. ఇక్కడ ఉన్న గ్రోత్‌ దేశంలోని ఏ నగరంలో లేదని వెల్లడించారు. వరంగల్‌లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిందందుకు రైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. మూడేండ్లలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు అభినందించారు. రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సీఈవో కృష్ణను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement