Wednesday, May 15, 2024

Nizamabad: అజ్మీర్ డెకరేషన్ షాపులో అగ్నిప్రమాదం

నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పక్కన గల అజ్మీర్ డెకరేషన్ షాప్ లో ఆవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.. సుమారు 5 నుండి 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని సమాచారం.. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. నిత్యం రద్దీగా ఉండే ఖలీల్ వాడి ప్రాంతంలో ఉదయం 11 సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో… దట్టమైన పొగలు కమ్మేయడంతో స్థానికులు పరుగులు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement