Thursday, May 2, 2024

సీఎంనే కొర‌డాతో కొట్టారు..ఎందుకో తెలుసా..

ఒక్కో చోట ఒక్కో ఆచారం ఉంటుంది. భార‌త‌దేశంలో ఎవ‌రి ఆచారాలు వారివి. అయితే ఇదేం ఆచారం అనాల్సిందే ఇప్పుడు చ‌దువుతోన్న వార్త చూస్తే..ఓ రాష్ట్రానికి సీఎం ఆయ‌న‌..మ‌రి ఆయ‌న‌నే కొర‌డాతో కొట్టారు..ఎందుక‌నుకుంటున్నారా..ఇదంతా ఓ ఆచారంలో భాగమే.. ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగానే ఆచారంలో భాగంగా ఆయన కొరడాతో కొట్టించుకోవ‌డం విశేషం.స్థానిక సంప్రదాయం ప్రకారం ‘సొంట’ (గడ్డితో చేసిన కొరడా) అనే కొరడాతో కొట్టించుకుంటారు. సంప్రదాయ వేషదారణ, తలపై పాగా ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సీఎం లాంటి వ్యక్తి ఇలా దెబ్బలు తినడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని కోరి ఇలా చేశానని చెప్ప‌డం ఆశ్చ‌ర్యం. ఇక ఈ వీడియోను ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి.. అన్ని అడ్డంకులు తొలిగిపోయి, ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఇలా చేశానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement