Thursday, April 25, 2024

నైట్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం.. 13మంది సజీవ దహనం

ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో 13మంది సజీవ దహనమైన విషాద ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సట్టహిప్‌ జిల్లాలోని మౌంటెన్‌ బీ నైట్‌స్పాట్‌ నైట్‌క్లబ్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్‌ మొత్తానికి మంటలు విస్తరించడంతో 13 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నైట్‌క్లబ్‌ మొత్తం కాలిపోయింది. మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. క్లబ్‌లోని గోడలకు ఉన్న రసాయనాల వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, వాటివల్ల మంటలను అదుపుచేయడానికి చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement