Thursday, May 2, 2024

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం

ఈరోజు తెల్లవారుజామున అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. క్యాంప్‌బెల్‌ బే తీరంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత 6.1గా నమోదైంద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. క్యాంప్‌బెల్‌ బే తీరానికి 431 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 75 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement