Saturday, April 27, 2024

Big Breaking | కోళ్లఫామ్​లో డ్రగ్స్​ తయారీ.. నాగర్​కర్నూల్​ జిల్లాలో భారీగా డ్రగ్స్​ స్వాధీనం

నాగర్​కర్నూల్​ జిల్లాలో డ్రగ్స్​ తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఇవ్వాల (బుధవారం) డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు సోదాలు చేశారు. బిజినేపల్లి మండలం వట్టెం శివారులోని ఓ కోళ్ల ఫామ్​లో జరిపిన సోదాల్లో భారీగా డ్రగ్స్​ని పట్టుకున్నారు. కోళ్ల ఫారమ్​లో డ్రగ్స్​ తయారు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతోనే ఈ రైడింగ్​ జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్​ తయారీ యంత్రాలను డీఆర్​ఐ అధికారులు సీజ్​ చేశారు.

అదేవిధంగా పెద్ద ఎత్తున అల్ఫ్రాజోలమ్​ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక.. 31.42 కిలోల అల్ఫ్రాజోలమ్​ పట్టుబడగా.. ఈ డ్రగ్స్ విలువ సుమారు 3.14 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుస్తోంది. ​

Advertisement

తాజా వార్తలు

Advertisement