Tuesday, April 30, 2024

TS | లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరో ముందడుగు.. భారీ పెట్టుబడికి స్టెమ్‌ క్యూర్స్ రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనలో రోజురోజుకూ పురోగతి కనిపిస్తోంది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరో భారీ పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా అతిపెద్ద ప్రయోగశాలను నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో తెలంగాణకు మరో పెట్టుబడి రానున్నదనీ, స్టెమ్‌ క్యూర్స్‌ కంపెనీ మాన్యుఫాక్చరింగ్‌ ల్యాబ్‌ ను నెలకొల్పనున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కే. తారక రామారావుతో స్టెమ్‌ క్యూర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ సాయిరాం అట్లూరి బోస్టన్‌ నగరంలో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టు-బడులకు గల అవకాశాలపై చర్చించారు.

ఈ ల్యాబ్‌ ప్రధానంగా స్టెమ్‌ చికిత్సపై దృష్టి సారిస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీమ్‌ సెల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ దాదాపు 54 అమెరికన్‌ మిలియన్‌ డాలర్ల పెట్టు-బడితో ఏర్పాటు- కానున్న ఈ తయారీ యూనిట్‌ తో 150 మందికి పైగా ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తాయి. అమెరికాలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకువచ్చి తీవ్రమైన వ్యాధులకు స్టెమ్‌ సెల్‌ ఉత్పత్తులతో చికిత్సను అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. ప్రపంచ మెడికల్‌ ఇన్నోవేషన్‌ కు తన సొంత నగరమైన హైదరాబాద్‌ హబ్‌ గా మారిందని సాయిరాం అట్లూరి సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీ-ఆర్‌ అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

త్వరలో హైదరాబాద్‌కు కంపెనీ ప్రతినిధులు
స్టెమ్‌ క్యూర్స్‌ కంపెనీ ప్రతినిధులను త్వరలోనే హైదరాబాద్‌ కు ఆహ్వానిస్తున్నట్లు- మంత్రి కేటీ-ఆర్‌ తెలిపారు. కంపెనీ పెట్టు-బడి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్‌ సెల్‌ థెరపీ తో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేటీ-ఆర్‌, ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మనదేశంలో విస్తృతంగా అందుబాటు-లోకి రావాలన్నారు. స్టెమ్‌ క్యూర్‌ సంస్థ ఏర్పాటు-చేయనున్న ల్యాబ్‌ తో దేశంలో ఈ చికిత్స విధానాలు అందరికి అందుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీ-ఆర్‌ వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement