Thursday, May 16, 2024

గౌరవప్రద అంత్యక్రియలు.. ప్రాథమిక హక్కు : కేరళ హైకోర్టు

తిరువనంతపురం : చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదమైన అంత్యక్రియలు ప్రాథమిక హక్కుల్లో భాగమే అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 జీవించే హక్కు గురించి చెబుతుండగా.. దాని పరిధి మరణించిన తరువాత కూడా ఉంటుందని వివరించింది. మరణించిన వ్యక్తి పట్ల ఎలాంటి అవమానం చూపడానికి సమాజాన్ని అనుమతించకూడదని వ్యాఖ్యానించింది. అసహజ మరణం అయినప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా తరగా అంత్యక్రియలు జరిగేలా చూడాల్సి ఉందని పేర్కొంది.

కేరళలో రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించడానికి సౌకర్యాల కల్పన విషయమై.. ప్రభుతానికి ఆదేశాలు ఇస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సౌకర్యాల కల్పనపై 2015లోనే ప్రభుతం ఉత్తరులు జారీ చేసిన.. ఇంతవరకు అమలు కాకపోవడాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. త్వరగా పూర్తి చేయాలి. అసహజ మరణాల్లో పోస్టుమార్టం త్వరగా పూర్తి చేయాలని, మృతదేహం కోసం వారి కుటుంబీకులు ఆస్పత్రుల బయట పడిగాపులు కాస్తున్నారన్నారు. పార్థీవ దేహాలను త్వరగా అందజేస్తే.. వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement