Saturday, April 27, 2024

పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి

పాకిస్థాన్‌లో హిందూ యువతి అరుదైన ఘనత సాధించింది. ఇండియాలో ఐఏఎస్ తరహాలో పాకిస్థాన్‌లో పీఏఎస్ ఉంటుంది. పీఏఎస్ అంటే పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అటు ఇండియాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో పాక్‌లో సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్ష నిర్వహిస్తారు. ఈ సీఎస్ఎస్ పరీక్షలో ఓ హిందూ యువతి ఉత్తీర్ణురాలై చరిత్ర సృష్టించింది.

ఆమె పేరు సనా రామ్ చంద్. సింధ్ ప్రావిన్స్‌లోరి షికార్ పూర్ జిల్లాకు చెందిన సనా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆమె కంటే ముందు హిందూ వర్గం నుంచి మరే మహిళా సీఎస్ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత పొందలేదు. సనా ఓ డాక్టర్. పీఏఎస్‌పై ఆసక్తితో ఆమె సీఎస్ఎస్ పరీక్ష రాసింది. ఇప్పుడు ఆమెను అసిస్టెంట్ కమిషనర్‌గా పాకిస్థాన్ అధికారులు నియమించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement