Tuesday, March 26, 2024

పెళ్లి అనే తప్పు జీవితంలో చేయను: ఛార్మి

ఛార్మి పెళ్లికి సంబంధించి నిన్నటి నుంచి రూమ‌ర్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో పెళ్లి చేసుకోన‌ని చెప్పిన ఛార్మి ఇప్పుడు స‌మీప బంధువుని చేసుకోబోతుంద‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో ఛార్మి త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. ఇప్పుడు నా కెరియ‌ర్ బెస్ట్ ఫేజ్‌లో ఉంది. నా జీవితం చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకోవ‌డం అనే త‌ప్పు నా జీవితంలో ఎప్ప‌టికీ చేయ‌నంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది ఛార్మి. దీంతో పుకార్లు అన్నింటికి పులిస్టాప్ ప‌డింది. న‌టిగా కాకుండా నిర్మాత‌గా కొత్త అడుగులు వేసింది. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఇచ్చిన జోష్‌తో ఛార్మి దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement