Thursday, May 2, 2024

భ‌గ్గుమంటున్న పెట్రోల్ ధ‌ర‌లు.. మ‌ళ్లీ 90 పైస‌లు పెంపు

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. 8 రోజుల్లో ఏడు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. ఇవాళ లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. లేటెస్ట్ పెంపుతో హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 113.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 99.83గా ఉంది. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.21, డీజిల్ ధ‌ర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.94, డీజిల్ ధ‌ర రూ. 96, కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధ‌ర రూ. 94.62గా ఉంది.

ధరల పెంపు ఉప‌సం‌హ‌రిం‌చు‌కో‌వాలి
ఇంధన ధరల పెంపును ఉప‌సం‌హ‌రిం‌చు‌కో‌వా‌లని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్ల‌మెం‌ట్‌లో ప్రక‌టన చేయా‌లని ప్రతి‌ప‌క్షాలు నిన్న డిమాండ్‌ చేశాయి. ధరల పెరు‌గు‌ద‌లకు రష్యా–‌ఉ‌క్రె‌యిన్‌ యుద్ధమే కార‌ణ‌మన్న ప్రభుత్వ వాద‌నను తోసి‌పు‌చ్చాయి. జీరో‌అ‌వర్‌లో లోక్‌‌స‌భలో కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ ఎంపీలు మాట్లా‌డుతూ ధరల పెరు‌గు‌ద‌లతో సాధా‌రణ ప్రజలు, వేతన జీవుల జేబులు గుల్ల‌వు‌తు‌న్నా‌యని విమ‌ర్శిం‌చారు. ధరల పెరు‌గు‌ద‌లపై చర్చిం‌చా‌లని, దీనికి ఎప్పుడు పుల్‌‌స్టాప్‌ పడు‌తుందో ప్రధాని సమా‌ధానం చెప్పా‌లని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement