Sunday, April 28, 2024

జెస్సీ నుండి శ‌కుంత‌ల‌..యశోదగా మారిన స‌మంత‌- ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

ఏమాయ‌చేసావే చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది స‌మంత‌.ఆ చిత్రం విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో చిన్న హీరోల ద‌గ్గ‌ర నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు అంద‌రితో ఆడి పాడింది స‌మంత‌. కాగా నేడు స‌మంత పుట్టిన రోజు..కాగా ద‌ర్శ‌కుడు గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ లో శకుంతలగా నటిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌.కాగా సమంత కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ. మరోవైపు పాన్ ఇండియా చిత్రం యశోదలో కూడా సామ్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ రెండు చిత్ర యూనిట్స్ నుంచి సామ్ ఫాన్స్ కి బర్త్ డే ట్రీట్ అందింది. శాకుంతలం టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సమంతకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ పోస్టర్ లో సమంత దేవకన్యలాగా వెలిగిపోతోంది. తెల్ల చీరలో సమంత మతిపోగోట్టే విధంగా శకుంతల లుక్ లో కనిపిస్తోంది. పోస్టర్ డిజైన్, సమంత మేకోవర్ అదుర్స్ అనే చెప్పాలి. క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్.. దుష్యంతుడు, శకుంతల కథని అద్భుత దృశ్యకావ్యంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక సమంత నటిస్తున్న మరో మూవీ యశోద. సమంత బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. యశోద ఫస్ట్ గ్లింప్స్ ని మే 5న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సమంత నార్త్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.జీవితంలో ఎన్ని ఒడి దుడుకులు వ‌చ్చినా త‌న‌ప‌ని తాను చేసుకుంటూపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement