Wednesday, May 8, 2024

కామెంట్లు చేస్తే – తాట తీస్తా – ప్రియ‌మ‌ణి

సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ రెట్టింపు అవకాశాలతో దూసుకుపోతుంది హీరోయిన్ ప్రియ‌మ‌ణి. తాజాగా ఆమెపై ట్రోల్స్ , బాడీషేమింగ్స్ కామెంట్లపై స్పందించారు. మీమ్స్ ని తాను ఎంజాయ్‌ చేస్తానని చెప్పింది. వాటిని చూసుకుని నవ్వుకుంటానని, కొన్నింటిని షేర్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తానన్నారు. సోషల్‌ మీడియా అనేది మన జీవితం కాదని, నేను అభిమానులకు ఏం చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతానని, వాటిని స్వీకరిస్తే పర్వాలేదని, కానీ కొందరు ట్రోల్స్ చేస్తుంటారు. వారికి స్పందించే అధికారం ఉంది. కానీ అది శృతి మించితే మాత్రం ఊరుకోబోనని చెప్పేసింది. శృతిమించిన కామెంట్లని తాను జీర్ణించుకోలేనని పేర్కొంది ప్రియమణి. అలాంటి వాటికి వెంటనే గట్టి సమాధానం ఇస్తానని, లేదంటే వారిని బ్లాక్‌ చేస్తానని పేర్కొంది. మరోవైపు బాడీ షేమింగ్‌పై వచ్చే ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ, శరీరాకృతిని మార్చుకోవడానికి వ్యాయామాలు చేయనని తాను చెప్పనని, మీ పట్ల మీరు సంతోషంగా ఉంటే చాలని, ఎవరి కామెంట్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీరో ప్లస్‌ బాడీ ఉంటే, వాటిని పట్టించుకోవడం కంటే మీకు అవసరమైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. మీకు ఇష్టమైన పని చేయడానికి, మీరు ఆరోగ్యంగా ఉండేందుకు కొంత సమయం కేటాయించాల తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement