Sunday, May 19, 2024

ఐకానిక్ రాజ్ మందిర్ సినిమాలో -కంగ‌నా 25అడుగుల క‌టౌట్

ఎటువంటి విష‌యానైనా కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతుంది బాలీవుడ్ బ్యూటీ కంగ‌నార‌నౌత్. అందుకే ఈమెను వివాదాస్ప‌ద న‌టి అని కూడా అంటారు. కాగా ఈమె ప్ర‌స్తుతం ధాకడ్’ అనే యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ధాకడ్ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ పిక్చర్ కు సంబంధించిన 25 అడుగుల కటౌట్ ను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ఐకానిక్ రాజ్ మందిర్ సినిమాలో ఏర్పాటు చేశారు. దానిని కంగన ఆవిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న‌ నెటిజన్లు, కంగన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజ‌కీయాల‌పై కూడా ఈ మ‌ధ్య యాక్టీవ్ గా ఉంటోంది కంగ‌నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement