Thursday, May 2, 2024

లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో – హీరోయిన్ అతియాశెట్టి వివాహం

సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి త‌న‌య అతియాశెట్టి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లో న‌టిస్తోంది. 2015 లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది.సునీల్ శెట్టిది తుళు ఫ్యామిలీ.మంగళూరు కొప్పల సమీపంలోని ముల్కి వారి స్వస్థలం.అనంతరం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో సునీల్ శెట్టి ముంబైలో స్థిరపడ్డారు. కాగా టీమిండియా స్టార్ ప్లేయర్, లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని ఈ భామ వివాహం చేసుకోనుంద‌ట‌.. ఈ సంవత్సరం చివరిలో పెళ్లికి ముహూర్తాలు పెట్ట‌నున్నారు.దీనికి కేఎల్ రాహుల్- అతియా శెట్టి కుటుంబాల వారు అంగీకరించార‌ట‌.కేఎల్ రాహుల్ గతకొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి తో ప్రేమ లో ఉన్నారు.కేఎల్ రాహుల్ స్వస్థలం కూడా మంగళూరే.అతనితో పెళ్లి కి రెండు కుటుంబాలవారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement