Tuesday, April 30, 2024

చ‌ర‌ణ్ నువ్వు లేకుండా – ఆర్ ఆర్ ఆర్ ని ఊహించ‌లేను – ‘ఎన్టీఆర్’ లేఖ‌

ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై స్పందిస్తూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ లేఖ‌ని విడుద‌ల చేశాడు. ప్ర‌స్తుతం అది నెట్టింట వైర‌ల్ అవుతుంది.
తార‌క్ విడుద‌ల చేసిన లేఖ‌లో ‘నా కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా ఆర్ఆర్ఆర్‌ను నిలిచిపోయే విధంగా చేసిన ప్ర‌తిఒక్క‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. నాలోని బెస్ట్ ఇవ్వ‌డానికి నన్ను ప్రేరేపిపించిన జ‌క్క‌న్న‌కు ధ‌న్య‌వాదాలు. చ‌ర‌ణ్ నువ్వు లేకుండా ఆర్ఆర్ఆర్‌ను ఊహించలేను. నువ్వు లేక‌పోతే ఆర్ఆర్ఆర్ లేదు అల్లూరి పాత్ర‌కు నువ్వు సంపూర్ణ న్యాయం చేసావు. అల్లూరి పాత్ర‌లేక‌పోతే భీమ్ పాత్ర అసంపూర్ణంగా ఉండేది. అజ‌య్ స‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నాకు ద‌క్కిన గౌరవం. కీర‌వాణి గారు ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోసారు అంటూ ఈ చిత్రంలోని ప్ర‌తి టెక్నీషియ‌న్‌కు ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ లేఖ‌ను విడుద‌ల చేశాడు. అంతే కాకుండా భారతీయ సినిమా ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ని, ఆర్ఆర్ఆర్ చిత్రం కేవలం భార‌త‌దేశంలోని అతి పెద్ద యాక్ష‌న్ డ్రామా చిత్రం కాదు.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద యాక్ష‌న్ డ్రామా చిత్రం’ అని లేఖ‌లో వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం ఈ లేఖ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో న‌టించ‌గా. తార‌క్ భీమ్ పాత్ర‌లో న‌టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement