Tuesday, May 21, 2024

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ ‘మారుతీ’ డైరెక్ష‌న్ లో !

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేతిలో ప‌లు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుషు, స‌లార్, ప్రాజెక్ట్ K పాన్ ఇండియా మూవీలే. కాగా ఈ చిత్రాల‌తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందుగా ఆయన ద‌ర్శ‌కుడు మారుతి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి ‘రాజా డీలక్స్’ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మారుతి కూడా ఈ వార్తలను ఖండించలేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా సెట్స్ నిర్మాణం జరుగుతోందట‌. చాలా వరకూ ఈ సెట్స్ లోనే షూటింగు జరగ‌నుంద‌ని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, పెద్దగా గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement