Sunday, May 5, 2024

మౌంటెన్ డ్యూ యాడ్ కోసం మ‌హేశ్ బాబుకి భారీ రెమ్యున‌రేష‌న్

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు సినిమాల‌తోనే కాదు, యాడ్స్ తో కూడా బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే డ‌జ‌నుకు పైగా బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తున్నాడు. యాడ్ ని బ‌ట్టి మ‌హేశ్ బాబు రెమ్యూన‌రేష‌న్ ఉంటుంది. తాజాగా మౌంటెన్ డ్యూ యాడ్ కోసం భారీ పారితోషికం అందుకున్నార‌ట‌. ఈ ప్రకటనను దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా దగ్గర షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ ని హృతిక్ రోషన్ చేశాడు. తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ ప్రమోట్ చేయడానికి మహేశ్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కూడా ఈ బ్రాండ్ ని ఆయనే ప్రమోట్ చేశాడు. అప్పుడు 7 కోట్లు తీసుకున్న మహేశ్.. ఈ సారి 5 కోట్లు అధికంగా తీసుకున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ మౌంటెన్ డ్యూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ను మహేశ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 12 కోట్ల రెమ్యునరేషన్ ను మహేశ్ అందుకున్నట్లు టాక్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement