Thursday, May 16, 2024

భారీ మంచు.. టన్నెల్ లో చిక్కుకున్న400లకు పైగా వాహనాలు.. కాపాడిన పోలీసులు


పర్యాటక ప్రాంతాలైన కులు మనాలి..లామౌల్..స్పితిలకు గత వారం రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగింది.గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో మొత్తం 11,188 వాహనాలు అటల్‌ టన్నెల్‌ ద్వారా వెళ్లాయి. ఈ సొరంగం ద్వారా సుమారు 5,540 వాహనాలు లాహౌల్ లోయలోకి ప్రవేశించాయి.హిమపాతం వల్ల 400కుపైగా వాహనాల్లోని పర్యాటకులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో వారిని రక్షించారు. గురువారం మధ్యాహ్నం నుంచి భారీగా హిమపాతం కురిసింది. దీంతో పోలీసులు సాయంత్రం 4 గంటలకు సిస్సు వద్ద సొరంగం ఉత్తర వైపున100 వాహనాలను నిలిపివేశారు.

మరోవైపు టన్నెల్‌ దక్షిణ వైపు మూడు టూరిస్ట్ బస్సులు, 25 టెంపోలతో సహా సుమారు 300 వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో భయాందోళన చెందిన వారంతా ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా తమను రక్షించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు స్పందించారు. లాహౌల్‌, కులు, స్పితి నుంచి 60 వాహనాల్లో రెస్క్యూ సిబ్బందిని పంపారు. స్థానిక టాక్సీ ఆపరేటర్లు, ఇతరుల సహాయంతో వందలాది వాహనాల్లో చిక్కుకున్న పర్యాటకులను కాపాడారు. శుక్రవారం టన్నెల్‌లో చిక్కుకున్న వాహనాలన్నీ సురక్షితంగా బయటకు వచ్చాయి. దీంతో వందలాది వాహనాల్లోని పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement