Friday, May 3, 2024

తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లు.. రెండు రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో  రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, పరి‌సర ప్రాంతాల్లో సముద్రమ‌ట్టా‌నికి 0.9 కిలో‌మీ‌టర్ల నుంచి 2.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ద్రోణి వ్యాపించి ఉన్నది. పశ్చిమ, వాయ వ్య దిశల నుంచి రాష్ర్టంలో కింది‌స్థాయి గాలులు వీస్తు‌న్నాయి. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలోని పలు‌చోట్ల నేడు, రేపు ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

ఆదివారం తెల్లవారుజాము వరకు హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోటి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. శనివారం అత్యధి‌కంగా మహ‌బూ‌బా‌బాద్‌ జిల్లా కురవి మండలం ఉప్పర‌గూ‌డెంలో 13 సెంటీ‌మీ‌టర్లు, పెద్దపల్లి జిల్లాలోని మల్యా‌ల‌ప‌ల్లిలో 7, రామ‌గుం‌డంలో 6.9, మంచి‌ర్యాల జిల్లా నర్సా‌పూ‌ర్‌లో 5.93, సూర్యా‌పేట జిల్లా మోతె మండలం మామిళ్లగూ‌డెంలో 5.83, ఖమ్మం జిల్లా ఎర్రు‌పా‌లెం‌టలో 5.20 సెంటీ‌మీ‌టర్ల వర్షం కురిసినట్టు వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement