Monday, April 29, 2024

Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆందోళనలో అన్నదాతలు

తెలంగాణలో వాతావరణం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. అయితే, ఇప్పుడు రాష్ట్రం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోనూ భారీగా వర్షం పడింది. కుమ్రం భీం జిల్లాలోని బెజ్జూర్‌లో 7.6 సెంటీమీటర్లు, రవీంద్రనగర్ లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట్ మండలంలో చల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పూర్తిగా తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement