Sunday, April 28, 2024

Breaking | కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. వాహనాలపై పడిపోయిన ఆర్చి

కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో ఇవ్వాల (శనివారం) సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు చోట్ల పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్​ స్తంభాలు నెలకూలాయి. విద్యుత్​కు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక.. కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంపు, రామాలయం ఎదురుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మున్సిపాల్టీ వారు ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్చి గాలివేటుకు కూలిపోయింది.

దీంతో ద్విచక్ర వాహనాలు, ఫోర్​ వీలర్స్​ మీద ఆర్చి కుప్పకూలడంతో పలు వాహనాలు డ్యామేజ్​ అయ్యాయి. అయితే.. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఇవ్వాల కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించింది. దీంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement