Tuesday, May 7, 2024

Breaking: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (బుధవారం) సాయంత్రం నుంచి వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా దంచికొడుతున్నట్టు సమాచారం అందుతోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాకా హాట్​ హాట్​​గా ఉన్న వెదర్ ఆ తర్వాత మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి.

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, పెద్ద అంబర్​పేట్​ హయత్​నగర్​, వనస్థలిపురం, ఎల్బీనగర్​ మన్సూరాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి, కొత్తపేట వంటి పలు ఏరియాల్లో మోస్తరు జల్లులు పడుతున్నాయి. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.  

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు జల్లులుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. దంచికొట్టన ఎండలకు, హెవీగా పెరిగిన టెంపరేచర్లతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. కురుస్తున్న వానలు, చల్లగా మారిన వెదర్​తో రిలీఫ్​ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement