Thursday, April 25, 2024

Cricket: టీమిండియాపై ఇంగ్లండ్​ మాజీ కెప్టెన్​ షాకింగ్‌ కామెంట్స్‌.. గట్టిగనే తిప్పికొట్టిన హార్దిక్‌ పాండ్యా

టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌ గండాన్ని దాటలేకపోయిన టీమిండియాపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ మరోసారి అవాచకలు చెవాకులు పేలారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా ప్రదర్శన అస్సలు బాగాలేదని, చరిత్రలో ఇంత చెత్తగా ఎవరూ ఆడలేదని… ఇంగ్లండ్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్‌లో వ్యాఖ్యానించారు. మైఖేల్‌ వాన్‌ భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023 జరుగనున్నప్పటికీ టీమిండియా ఎప్పటికీ ఫేవరేట్‌ కాలేదని, వాళ్లకు అంత సీన్‌ లేదని వాన్‌ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు షాకిచ్చినట్టే, వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ను చిత్తుగా ఓడిస్తుందని కామెంట్స్ చేశారు.

హార్దిక్‌ పాండ్యా ఆగ్రహం
భారత జట్టును ఉద్దేశించి ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఘాటుగా స్పందించారు. ప్రపంచకప్‌ టోర్నీ గెలవగానే వాన్‌కు అహంకారం తలకెక్కిందని, ఏదో ఒక్క కప్‌ గెలిచినంత మాత్రాన క్రికెట్‌ను శాసిస్తున్నట్టుగా ఫీల్‌ అవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను తక్కువ‌ అంచనా వేస్తే ఏమవుతుందో వాన్‌కు గతంలో అనుభవమే, దాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుంది అని పాండ్యా పేర్కొన్నాడు. ”మా పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. అంతేగానీ ఎవరిముందో భారత జట్టు ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో సెమీస్‌ నుంచే టీమిండియా వెనుదిరిగిన మాట వాస్తవం… అయితే ఆటలో ఇవన్నీ సహజమే. పొరపాట్లు సరిచేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అంటూ హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement