Saturday, May 18, 2024

హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్న ప్రేమకు వందనం

అమ్మ నవమాసాలు మోసి మనకు ప్రాణం పోస్తే.. నాన్న మనకు జీవితాన్ని అందిస్తారు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత. అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ‘ఫాదర్స్ డే’ను నిర్వహిస్తున్నారు.

ఫాదర్స్ డే స్పెషల్ కొటేషన్స్

★ నాన్న.. ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మీరు.
మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ ఫాదర్స్ డే.

★ నాన్న.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.
నా మంచి, చెడు, ఆనందం, విజయం..
అన్నింటి వెనకా మీరే ఉన్నారు.
నా కోసం ఎంతో త్యాగం చేశారు.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా..

★ అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలిబుచ్చుతుంది
కానీ, నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు.
గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..
ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని
దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే
ఫాదర్స్ డే శుభాకాంక్షలు

- Advertisement -

★ మనలో జీవాన్ని నింపి,
అల్లారు ముద్దుగా పెంచి..
మనలోని లోపాలను సరిచేస్తూ,
మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ..
మనకు గమ్యం చూపేది.. ‘నాన్న’.
అనురాగానికి రూపం ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే.

Advertisement

తాజా వార్తలు

Advertisement