Tuesday, April 30, 2024

క‌ళాత‌ప్వి ‘కె.విశ్వ‌నాథ్’ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లెజండ‌రీ డైరెక్ట‌ర్, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ ని పెట్టారు. గురుతుల్యులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి, తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో, సంతోషంగా వుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన ట్విట్ లో పేర్కొన్నారు. కళాత్మకమైన సినిమాలకు కాశీనాథుని విశ్వనాథ్ పెట్టింది పేరు అని తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement