Sunday, April 28, 2024

Flash: హనుమకొండ జిల్లా రికార్డు.. టీనేజర్లకు 100 శాతం వ్యాక్సినేషన్..

కరోనా కట్టడిలో భాగంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15 నుండి 17 ఏళ్లు వారికి వ్యాక్సిన్ పంపిణీ 100 శాతం పూర్తి చేసుకున్న జిల్లా గా రికార్డు సాధించింది. జిల్లాలో 55 వేల 694 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని అధిగమించి 56 వేల 291 మందికి (101%) వ్యాక్సిన్ వేశారు.  

15 నుండి 17 సంవత్సరాల టినేజర్లకు 100 శాతం పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి రాష్ట్రంలో తొలి జిల్లాగా రికార్డు సాధించినందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్యను, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement