Monday, May 6, 2024

రావ‌ణాసుర షూటింగ్ లో ‘ర‌వితేజ‌’

సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న చిత్రం రావ‌ణాసుర‌. ఈ చిత్రంలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. కాగా ఇది యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. కాగా రవితేజ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనతో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఇతర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అందులో ప్రధాన తారాగణం మీద సన్నివేశాలు తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్‌లో రవితేజ జాయిన్ అయ్యారు. రావణాసుర సినిమా భోగి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత జనవరి 18న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు.

టాకీ పార్ట్ మొత్తాన్ని హైదరాబాద్‌లోని రియల్, నేచురల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్క సెట్ కూడా వేయడం లేదట‌. రవితేజ కెరీర్‌లో ఇలా చేయాలనుకోవడం ఇదే తొలిసారి. సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని కూడా రావణాసుర టీమ్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోసారి విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాలో చూపించబోతోన్నారట‌. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయ‌ర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement