Saturday, April 27, 2024

విద్యార్థి కోసం కారు ఏర్పాటు చేసిన రైల్వేశాఖ అధికారులు-ప్ర‌శంస‌లు కురిపించిన స‌త్యం

ఓ విద్యార్థి కోసం కారుని ఏర్పాటు చేశారు రైల్వేశాఖ అధికారులు. గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక విద్యార్థి వడోదరకు వెళ్లాల్సి ఉంది. అతని కోసం రైల్వే శాఖ అధికారులు కారులో ప్రయాణం ఏర్పాటు చేసి బంపర్ ఆఫర్ అందించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి సత్యం గధ్వి ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదర స్టేషన్ కు వెళ్లాల్సి ఉంది. ఈ ప్రయాణం రెండు గంటలు ఉంటుంది. దీనికోసం అతను ఏక్తా నగర్ నుంచి ప్రయాణించడానికి రైలు టికెట్ ని బుక్ చేసుకున్నాడు. వడోదర నుంచి సత్యం తన చివరి గమ్యస్థానం చెన్నైకి ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఏక్తా నగర్ నుంచి vadodaraను కలిపే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాడు.

అయితే భారీ వర్షాల కారణంగా ఏక్తానగర్ నుంచి వడోదరను కలిపే రైల్వే ట్రాక్స్ లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రైలు సర్వీసులు చివరిక్షణంలో రద్దు చేశారు రైల్వే అధికారులు. దీంతో చెన్నై వెళ్లే రైలు పట్టుకోవడానికి రైలు అధికారులు విద్యార్థిని తీసుకురావడానికి ప్రత్యేకంగా కారును అద్దెకు తీసుకున్నారు. కారు డ్రైవర్ కూడా సత్యంను సురక్షితంగా వడోదరాకు చేర్చాడు. అంతేకాదు అతని లగేజీ తీసుకుని అతడిని వడోదరాలో చెన్నై వెళ్లే రైలు లో సకాలంలో ఎక్కించాడు. భారతీయ రైల్వే అధికారులు అందించిన అనూహ్యమైన ఈ సేవలకు ఆ విద్యార్థి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రైల్వే లోని ప్రతి ప్రయాణికుడికి అధికారులు ఇచ్చిన ప్రాధాన్యం చూసి సత్యం రైల్వే శాఖను ప్రశంసించారు. రైలు రద్దుతో కారు ఏర్పాటు చేసి వడోదరకు తీసుకువచ్చిన రైల్వే అధికారులను సత్యం అభినందించారు. విద్యార్థి సత్యం మాట్లాడిన వీడియోను రైల్వే డిఆర్ఎం ట్విట్టర్లో పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement