Friday, April 26, 2024

కరోనా మృతులకు రూ.50 వేలు.. ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు ఇలా..

తెలంగాణలో కోవిడ్-19తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలను ఎక్స్ గ్రేషియాగా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఎక్స్ గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దారకాస్తులను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలిపింది. కోవిడ్-19తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4,500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఈ దారఖాస్తులో బాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెట్లను జత పరచి మీ సేవా కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కోవిడ్ డెత్ నిర్దారణ కమిటీ… కోవిద్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. అనంతరం ఎక్స్-గ్రేషియా మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ అవుతాయి. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 -48560012  అనే నెంబర్ కు గానీ,  [email protected] అనే మెయిల్ కు సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement