Thursday, April 25, 2024

గ్రీన్ గ్రోత్ అంశంపై తొలి వెబినార్ లో ప్రసంగించిన.. ప్ర‌ధాని మోడీ

ప్ర‌పంచ గ్రీన్ ఎన‌ర్జీ మార్కెట్లో భారత్ ని అగ్ర‌గామిగా నిలిపేందుకు ఈ బ‌డ్జెట్ దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.
గ్రీన్ గ్రోత్ అనే అంశంపై బడ్జెట్ అనంతర తొలి వెబినార్ లో మోడీ ప్రసంగించారు… ఇంధన ప్రపంచంతో సంబంధం ఉన్న భాగస్వాములందరినీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని తాను ఆహ్వానిస్తున్నానన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆలోచనలు, సలహాలను కోరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 పోస్ట్ బడ్జెట్ వెబినార్ ల‌లో ఇది మొదటిది.ఈ వెబినార్ లో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. హ‌రిత వృద్ధి, ఇంధన పరివర్తన కోసం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగడం వంటి మూడు స్తంభాలను భారత్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కాగా, ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న భారత్.. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద ప్ర‌యివేటు రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించిందని తెలిపారు మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement