Sunday, May 5, 2024

బిజెపిలో చేరిన గ్రేట్ ఖ‌లి – మోడీ పాల‌నలో భాగ‌మ‌య్యేందుకే ఈ నిర్ణ‌యం

అంత‌ర్జాత‌యంగా రెజ్ల‌ర్ ఆట‌లో ఎన్నో మెడ‌ల్స్ సంపాదించిన మ‌ల్ల యుద్ధ వీరుడు గ్రేట్ ఖ‌లిగా పిలుచుకునే ద‌లీప్ సింగ్ రాణా బిజెపి పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ప్రధాని మోడీ చేస్తున్న కృషి ఆయన్ని సరైన ప్రధానిని చేస్తుందనేది నా అభిప్రాయం అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోడీ పాలనలో నేనూ ఎందుకు భాగం కాకూడదన్నది నా ఆలోచన. బీజేపీ జాతీయ విధానం నచ్చి బీజేపీలో చేరుతున్నాను’’ అని గ్రేట్ ఖలి ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికే చెందిన ఖలి బీజేపీలో చేరడం పార్టీకి ఎంతో కొంత లాభించనుంది. 49 ఏళ్ల గ్రేట్ ఖలి ప్రొఫెషనల్ రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ షిప్ ద్వారా ఇతడు సుపరిచితుడు. నటుడు కూడా. రెండు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించాడు. 7 అడుగుల ఒక అంగుళం ఎత్తుతో, తన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించేవాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement