Sunday, May 19, 2024

రూ.10కే ఎల్ఈడీ బల్బులు

కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీని పేరు గ్రామ్ ఉజాలా పథకం. ఈ స్కీమ్ కింద గ్రామీణ ప్రజలకు ఎల్‌ఈడీ బల్బులను అతి తక్కువ ధరకే అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎల్ఈడీ బల్బులు కేవలం రూ.10 కే ఇవ్వనున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ అనే కంపెనీ ఈ స్కీమ్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి విడత కింద బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బల్బులను రూ.10 విక్రయిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో తొలి విడత కింద తక్కువ ధరకే బల్బులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బల్బులకు మూడేళ్ల వారంటీ కూడా ఉంటుంది. ఎల్ఈడీ బల్బులు ముందుగానే పని చేయకపోతే వాటిని వెనక్కి ఇచ్చేసి కొత్త బల్బులు పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement