Monday, May 6, 2024

గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు, ఇవ్వాల్టి ధర ఎంతంటే..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా బుధవారం (మార్చి16)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 600ల వరకు త‌గ్గింపు న‌మోదైంది. వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. దేశీయంగా కిలో వెండిపై రూ.1000 పైగా తగ్గుముఖం పట్టింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,930
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600, 24 క్యారెట్ల ధర రూ.51,930,
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,570 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600, 24 క్యారెట్ల ధర రూ.51,930
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది.

వెండి ధరలు
వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.69,000 ఉండగా, ముంబైలో రూ.69,000 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కేరళలో రూ.72,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, విజయవాడలో రూ.72,800 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement