Sunday, April 28, 2024

TS | వృత్తిదారులకు గుడ్​ న్యూస్​.. లక్ష సాయం కోసం ఆన్​లైన్​లో అప్లికేషన్లు

బీసీ కులవృత్తుల వారికి, చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్​లైన్​లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైదరాబాద్​లోని డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో దీనికి సంబంధించిన వెబ్​సైట్​ కూడా లాంచ్ చేసినట్టు చెప్పారు.

ఈనెల 6వ తేదీ నుండి 20తేదీ వరకూ https://tsobmmsbc.cgg.gov.in వెబ్​సైట్​లో లక్ష రూపాయల సాయం కోసం అప్లై చేసుకోవాలని చెప్పారు మంత్రి గంగుల. ఫోటో, ఆధార్, కుల ద్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా అప్లికేషన్ ఫారంను రూపొందించామని మంత్రి తెలిపారు. వచ్చిన ధరఖాస్తులను జిల్లా యంత్రాంగంతో పరిశీలన జరిపి, లబ్దీదారులను ఎంపిక చేస్తామన్నారు. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తన ఆధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సహాయం విధివిదానాలను వేగంగా ఖరారు చేసి దశాబ్ది ఉత్సవాల్లోనే అందించిందని మంత్రి గంగుల తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement