Saturday, May 18, 2024

Breaking: సినీ ల‌వ‌ర్స్‌కి గుడ్‌న్యూస్‌.. భీమ్లా నాయ‌క్‌కు తెలంగాణ సర్కారు స‌పోర్ట్‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే అభిమానుల సంద‌డి అంతా ఇంతా కాదు. త‌న కోసం ప్రాణాలు సైతం ఇవ్వ‌డానికి కూడా వెన‌కాడ‌ని తెంప‌రిత‌నం ఉంటుంది ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్లో.. అయితే మ‌రో రెండ్రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన భీమ్లా నాయ‌క్ మూవీకి తెలంగాణ స‌ర్కారు కూడా స‌పోర్ట్‌గా నిలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాలుగు ఆట‌ల‌కు అద‌నంగా మ‌రో ఆట అంటే. 5వ షోకు కూడా స‌ర్కారు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం ఇప్పుడు సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

థియేటర్‌లలో ఫిబ్రవరి 25న మాస్‌ జాతరకు రంగం సిద్ధమైంది. ‘వకీల్‌సాబ్’ తర్వాత పవన్‌ కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ‘భీమ్లా నాయక్‌’ చిత్రానికి సంబంధించి ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు ఐదో ఆట ప్రదర్శన చేసుకోవచ్చని వెల్లడించడంతో అభిమానులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement