Saturday, May 18, 2024

పెరిగిన బంగారం ధరలు..స్థిరంగా వెండి

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.10 చొప్పున పెరిగింది. ప్రస్తుతం రూ.46 వేల 460కి చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.46,450 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు కూడా రూ.10 మేర పెరిగి రూ.50 వేల 680కి చేరింది. అంతకుముందు వరుసగా 6 రోజుల వ్యవధిలో రూ.1600 మేర తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ వరుసగా రెండు రోజులు పెరిగింది. దీపావళి, ధన్‌తేరాస్ నేపథ్యంలో డిమాండ్ వల్ల రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.60 వేల 500 వద్ద ఉంది. దీంతో గత 3 రోజులుగా సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు వారంలో ఏకంగా రూ.6500 మేర పతనమైంది. విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు సేమ్ హైదరాబాద్‌లో ఉన్నంతే ఉన్నాయి. మిగతా కొన్ని ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి సవరిస్తుంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement