Wednesday, May 8, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు నిన్న నిలకడగా కొనసాగింది. అయితే మళ్లీ ఈ రోజు మరోసారి పుత్తడి రేటు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా బంగారం ధరలపై ఒత్తిడి నెలకొందని అర్థం చేసుకోవాలి. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. సిల్వర్ రేటు కూడా దిగి వచ్చింది. వెండి రేటు నాలుగు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. వెండి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.

హైదరాబాద్‌లో ఆగస్ట్ 20న గోల్డ్ రేటు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 100 మేర దిగొచ్చింది. దీంతో ఈ పసిడి రేట్లు వరుసగా రూ. 52,150కు, రూ. 47,800కు తగ్గాయి. అలాగే వెండి రేటును పరిశీలిస్తే.. సిల్వర్ రేటు రూ. 400 దిగి వచ్చింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 62 వేలకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా పసిడి ట్రెండ్ కిందకే కొనసాగుతోంది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.62 శాతం మేర పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1760 డాలర్లకు క్షీణించింది. అదే సమయంలో వెండి రేటు కూడా వెలవెలబోయింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 2.56 శాతం పతనమైంది. దీంతో వెండి రేటు ఔన్స్‌కు 18.96 డాలర్లకు దిగి వచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు మళ్లీ పడిపోతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement