Sunday, May 12, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.200 మేర ధర తగ్గింది. దీంతో ఇప్పుడు రూ.51,650 వద్దకు చేరింది. ఇదే సమయంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.200 పడిపోయి రూ.56,350 వద్ద ఉంది. దిల్లీలో కూడా బంగారం ధర పడుతోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామ్స్‌కు రూ.200 తగ్గిపోయి రూ.56,500 వద్ద ఉండగా.. ఇదే 22 క్యారెట్లకు రూ.150 పడిపోయి రూ.51,800 మార్కు వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ను కాయిన్లు, బిస్కెట్లు, కడ్డీల రూపంలో విక్రయిస్తుంటారు. 22 క్యారెట్స్ గోల్డ్‌ను ఆభరణాల తయారీలో వినియోగిస్తారు. దీనికి ఇతర లోహాలను కలిపి బంగారు ఆభరణాలు రూపొందిస్తారు. ఇక వచ్చే నెల నుంచి ఆరంకెల హాల్‌మార్క్ లేని గోల్డ్ జువెలరీ విక్రయాలపై నిషేధం విధించింది కేంద్రం. ఆ అమ్మకాలు జరగవని స్పష్టం చేసింది. మరోవైపు గోల్డ్ బులియన్‌కు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా కూడా సన్నాహాలు చేస్తోంది.మరోవైపు వెండి రేట్లు భారీగా పెరిగిపోయాయి. దేశరాజధాని దిల్లీలో కిలో వెండి ఒక్కరోజే రూ.3000 పెరిగింది. దీంతో మరోసారి రూ.70 వేల మార్కును తాకింది. హైదరాబాద్‌లో చూస్తే కేజీ సిల్వర్ ధర రూ.600 పడిపోయింది. దీంతో ఇక్కడ కూడా రూ.70 వేల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, దిల్లీలో తాజాగా వెండి రేటు ఒకేలా ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement