Friday, May 3, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర జూలై 20న రూ. 110 మేర పెరిగింది. రూ. 46,300కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 120 ర్యాలీ చేసింది. దీంతో గోల్డ్ రేటు తులం రూ. 50,510కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ . కాగా బంగారం ధరలు నిన్న నిలకడగానే కొనసాగిన విషయం తెలిసిందే. ఇక వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర మాత్రం ఈరోజు భారీగా పడిపోయింది. ఏకంగా రూ. 1000 మేర పతనమైంది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 60,700కు దిగివచ్చింది. కాగా వెండి రేటు నిన్న పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రివర్స్ గేర్‌లో పయనిస్తున్నాయి. బంగారం ధర క్షీణిస్తే.. వెండి రేటు పరుగులు పెడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఈరోజు 0.04 శాతం తగ్గింది. ఔన్స్‌కు పసిడి రేటు 1710 డాలర్లకు క్షీణించింది. అలాగే వెండి రేటు అయితే 0.11 శాతం పెరిగింది. దీంతో వెండి రేటు 18.73 డాలర్లకు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement