Thursday, April 18, 2024

పాలు..పాల ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ- నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపు

దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. కాగా ఇప్పుడు పాలు..పాల ఉత్ప‌త్తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డాన్ని నిర‌సిస్తూ టీఆర్ ఎస్ ఆందోళ‌న చేపట్ట‌నుంది.చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని, బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement