Sunday, May 5, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. వరుసగా 3 రోజుల్లో ఏకంగా రూ.1300 మేర బంగారం ధర తగ్గింది. సిల్వర్ ధర మళ్లీ భారీగా పడిపోతుంది. ఒక్కరోజులో ఏకంగా రూ.1000 తగ్గింది. ఇది 3 రోజుల్లో చూస్తే 3000 రూపాయల మేర క్షీణించింది. వారం రోజుల్లో ఏకంగా రూ.4000 పతనం కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.250 మేర పతనమైంది. దీంతో ముందటి రోజు రూ. 46,900గా ఉన్న ధర అక్టోబర్ 13న ఏకంగా రూ.46,650కి పడిపోయింది. ఇదే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 270 తగ్గింది. దీంతో రూ.51,160 నుంచి రూ.50, 890కి రేటు తగ్గింది. హైదరాబాద్‌లో వరుసగా 3 రోజుల్లో రూ.1300 తగ్గింది. అంతకుముందు 4 రోజులు స్థిరంగా ఉండగా.. దానికి ముందు వరుసగా రేట్లు పెరగడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement