Saturday, May 4, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేలుగా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,200గా కొనసాగుతోంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్న ఈ సమయంలో.. వెండి రేట్లు మాత్రం కిందకి పడిపోయాయి. కేజీ వెండి రేటు రూ.800 తగ్గి రూ.60,700కు దిగొచ్చింది. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అక్కడ రూ.46,150గా నమోదవుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,350గా ఉంది. ఢిల్లీలో సిల్వర్ రేటు కూడా మారలేదు. నిన్న, ఇవాళ ఒకే దగ్గర కొనసాగుతోంది. కేజీ వెండి రేటు అక్కడ రూ.56,300గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement